గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కొలనుకొండ వంతైనపై నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్‌ఆర్‌టిసి) బస్సు బోల్తా పడి 40 మంది గాయపడ్డారు. ఈ బస్సు 50 మంది ప్రయాణికులతో మంగళగిరి నుంచివిజయవాడకు బయలుదేరింది.
గురువారం ఉదయం బస్సు మంగళగిరి వంతెనపై వేగంగా దూసుకెళ్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన 25 మంది ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై ఆర్టీసి ఉన్నతాధికార వర్గాలువిచారణకు ఆదేశించాయి.