రాజకీయాలు వద్దంటున్న రామారావు

హైదరాబాద్‌: ప్రస్తుతం తాను రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని సిక్కిం గవర్నర్‌గా నియమితులైన వి. రామారావు గురువారంవిలేకరులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామారావు భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు.

ఆయన ఈ నెల 25వ తేదీన సిక్కిం గవర్నర్‌గా పదవీ బాధ్యతలుస్వీకరిస్తారు. రాష్ట్రంలో బిజెపి పరిస్థితి గురించి అడిగినప్పుడు- తాను రాజ్యాంగపరమైన పదవిలో నియతుడినయ్యాయని, ఈ సమయంలో తాను రాజకీయాల గురించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తనపై పెట్టిన బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తనకు ఈ పదవి కొత్త అని, అయితే తనకు సమస్యలు తెలుసునని,అందువల్ల ఈ బాధ్యతల నిర్వహణ తనకు కష్టం కాదని ఆయన అన్నారు. సిక్కిం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని, కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగు పరచడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+