హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో ఒక రోజు ఉంటారు.
బిల్, మిలిందా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడ్స్ నిర్మూలనా కార్యక్రమాల్ని పరిశీలించడానికి ఆయన భారతదేశానికి వస్తున్నారు. నవంబర్ 11వ తేదీ నుంచి ఆయన నాలుగు రోజుల పాటు ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగుళూర్ నగరాల్లోని వివిధకార్యక్రమాల్లో పాల్గొంటారు. సియాటిల్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బిల్ గేట్స్ భారత పర్యటనవివరాలను తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం, బిల్‌గేట్స్ సంస్థ కలిసి రాష్ట్రంలో 2500 లక్షల డాలర్ల ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి