మూడో క్యాసెట్ పంపినవీరప్పన్
మైసూరు: మాజీ మంత్రి హెచ్. నాగప్పను కిడ్నాప్ చేసిన అడవిదొంగవీరప్పన్ మూడో క్యాసెట్ పంపించాడు. నాగప్ప విడుదలకు తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయననువీరప్పన్ కిడ్నాప్ చేసి 43 రోజులు గడుస్తోంది.
రెండో క్యాసెట్ పంపిన తర్వాత చాలా కాలం వీరప్పన్ మౌనం వహించాడు. తనతో సంప్రదింపులు జరపడానికి తమిళ కార్యకర్త కొల్లత్తూరు మణిని గానీ, తమిళ జాతీయోద్యమనేతపి. నెడుమారన్‌ను గానీ దూతగా పంపాలని వీరప్పన్ రెండో క్యాసెట్‌లో డిమాండ్ చేశాడు. కర్ణాటక ప్రభుత్వం దూతను పంపడానికిఅంగీకరించింది. అయితే మణిని గానీ, నెడుమారన్‌ను గానీ పంపడానికి ఇష్టపడలేదు. దీంతో నాగప్ప విడుదలకు జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.












Click it and Unblock the Notifications
