తమిళనాడు బంద్ ప్రశాంతం
చెన్నై: కావేరీ జలాల విడుదలవిషయంలో కర్ణాటక వైఖరికి నిరసనగా అఖిల పక్షం బుధవారం తలపెట్టిన12 గంటల బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా అవాంఛనీయమైన సంఘటలేవీ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బంద్‌తో తమిళనాడులో ప్రజా జీవనం స్తంభించింది. రవాణా సౌకర్యాలు లేకుండా పోయాయి. పలురైళ్లు రద్దయ్యాయి. బస్సులు కూడా నడవడం లేదు. వాణిజ్య సంస్థలను మూసేశారు. ప్రధానమైన నగరాల్లో, పట్టణాల్లో ఆటోలు, రిక్షాలు కూడా తిరగలేదు. ఆరు గంటల తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికిరైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications
