కృష్ణ తప్పులు చేశారు: దేవెగౌడ
బెంగుళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ వైఖరి వల్లనే కావేరీవివాదం జటిలమైందని మాజీ ప్రధాని దేవెగౌడవిమర్శించారు. ఈ విషయంలో వాస్తవాలను వెల్లడించడానికి తాను ఒక యాత్ర చేపట్టనున్నట్లు ఆయన బుధవారంవిలేకరులతో చెప్పారు.
తన యాత్ర తలకోన నుంచి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. కృష్ణ చేష్టల వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా కృష్ణ తప్పులమీద తప్పులు చేశారని ఆయన అన్నారు. ఈ విషయంలో తాను వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
