నైవేలీ ర్యాలీకి రజనీ డుమ్మా
చెన్నై: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసే వరకు ఎన్ఎల్సి నుంచి కర్ణాటకకువిద్యుత్ సరఫరాను ఆపేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన తలపెట్టిన ర్యాలీలో పాల్గొనేందుకు దక్షిణ భారత ఫిల్మ్ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడువిజయ్కాంత్ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఆయన అర్థాంతరంగా తన విదేశీ యాత్రను ముగించుకుంటున్నారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ ర్యాలీలో పాల్గొనడం లేదని, తనకు ఫోన్ చేసి రజనీకాంత్ ఈవిషయం చెప్పారని విజయ్‌కాంత్ విలేకరులతో చెప్పారు. అయితే సంఘం చేపట్టే ఆందోళనలకు తన మద్దతు ఉంటుందని రజనీకాంత్ చెప్పినట్లు ఆయన తెలిపారు. నైవేలీ ర్యాలీ అవసరం లేదని, తాను కావేరీ జలాలవిషయంలో ప్రధానితో మాట్లాడుతానని రజనీకాంత్ ఇంతకు ముందు చెప్పారు.












Click it and Unblock the Notifications
