న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీస్ జారీ చేసింది.
కర్ణాటక జలవనరుల మంత్రి హెచ్.కె. పాటిల్‌కు కూడా కోర్టు నోటీసు జారీ చేసింది.వీరికే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా సుప్రీం కోర్టు నోటీసు జారీఅయింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారంటూ వారిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదు.