తిరుపతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన పది చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తిరుమలలో ఉన్న అపరిశుభ్ర పరిస్థితుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పారిశుధ్య అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా ఆయన టిటిడిని ఆదేశించారు. స్థానికులకు ఉపాధి కల్పించడానికి ఒక పథకాన్ని రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.