కులాసాపడ్డ వాజ్‌పేయి
వరంగల్: తొలిసారిగా రాష్ట్ర బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, నాయకులు టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిదిరోజులుగా బిజెపి చేపట్టిన సస్యశ్యామల యాత్రలు శనివారం వరంగల్ లో ముగిశాయి. ఈ సందర్భంగా వరంగల్ లోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడుతో పాటు, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, కృష్ణంరాజు, బిజెపి నేతలు చిలకం రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సస్యశ్యామల యాత్రలపై కొందరు టీడీపీ నేతలు విమర్శించడాన్ని బిజెపి నేతలు తప్పుపట్టారు.
దేవాదుల ప్రాజెక్ట్ పై ఇప్పటివరకు సరైనా ప్రణాళిక కూడా రూపొందించని టీడీపీ బిజెపిని విమర్శించడం హాస్యస్పదంగా ఉందన్నారు. కేంద్రంతో మాట్లాడి సాగునీటి ప్రాజెక్టులను వేగిరం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అయితే, రాష్ట్రప్రభుత్వానికే సాగునీటి ప్రాజెక్టులపైసరైనా అవగహన లేదని విమర్శించారు. బిజెపి నేతలు ముఖ్యంగా వరంగల్ జిల్లా నాయకుడు, మంత్రి కడియం శ్రీహరిపై పలువిమర్శలు చేశారు.
పనికి ఆహారపథకంపై కూడా వారు పదునైన వ్యాఖ్యానాలు చేశారు. బియ్యం బుక్కి(తిని) బీరాలు పోవడం తెలుగుదేశం నాయకులకే చెల్లిందని బండారు దత్తాత్రేయ అన్నారు.












Click it and Unblock the Notifications
