కులాసాపడ్డ వాజ్‌పేయి
వరంగల్: రాష్ట్రానికి ఈ ఏడాది మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని అదనంగా కేంద్రం మంజూరు చేసింది. ఈవిషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు వెల్లడించారు. శనివారం ఆయన ప్రధానితో చర్చించాక, ఈవిషయాన్ని విలేకరులకు తెలిపారు. శనివారం నాడు జరిగిన సస్యశ్యామల యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వచ్చిన వెంకయ్యనాయుడువిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అంటూ ప్రచారం చేస్తోందని, దానిఅర్థం ఉత్తుత్తి విద్యుతేనని ఆయన ఎద్దవే చేశారు.విద్యుత్ పై అటు కాంగ్రెస్ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా, ఇటు రాష్ట్రప్రభుత్వమూ 24 గంటల కరెంట్ సత్యదూరంగా ప్రవర్తిస్తోందని ఆయనవిమర్శించారు.
త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నామని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం ఇందుకోసం భారీ ప్రణాళికలను రూపొందిస్తుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
