న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరులో భారత్‌విజయం సాధించి తీరుతుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. బ్రిటన్, సైప్రస్, డెన్మార్క్ దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన సోమవారంవిలేకరులతో మాట్లాడారు.
కొత్త రూపంలో తలెత్తిని ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరులో భారత్ గెలిచి తీరుతుందని ఆయన అన్నారు.ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, ఆర్థిక మంత్రి జస్వంత్‌సింగ్, ఇతర మంత్రి వర్గం సహచరులు, త్రివిధ దళాల అధిపతులు, తదితరులుస్వాగతం పలికారు. ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.