వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడ్స్‌ చట్టంపై వెనకడుగుథట్స్‌ తెలుగు.కామ్‌ ప్రతినిధి Home Full Story

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఎయిడ్స్‌ చట్టంపై రాష్ట్రప్రభుత్వం వెనక్కి తగ్గింది.పెళ్ళికి ముందు యువతీయువకులు తప్పకుండా ఎచ్‌.ఐ.వి పరీక్ష జరిపేలా చట్టం తీసుకొస్తామని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు పునఃపరీశీలన జరుపుతోంది. మేధావులు, నిపుణులు, సామాజిక కార్యకర్తల నుంచిపెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో ఈవిషయంలో నిదానమే ప్రధానమని నిర్ణయించిందని తెలిసింది.

రాష్ట్రంలో ఎయిడ్స్‌ భయంకరంగా వ్యాపిస్తోంది. దీని బారిన చిన్న పిల్లలు కూడా పడుతుండడంతో ఆందోళన చెందుతోన్న ప్రభుత్వ యంత్రాంగం ఈ చట్టం తీసుకురావాలని యోచించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాద్‌ రావు తీసుకొన్న ప్రధాన నిర్ణయం ఇదే.

నివారణకు ఇదేసరైన మార్గమని ఆయన యోచన. అయితే, ఈ నిర్ణయం అనేక సామాజిక రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దేశంలోనే ఇలాంటి ప్రథమంగా చట్టం తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యక్తమవుతోన్న అభ్యంతరాలుఇవి....
  • రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లున్నాయి?
  • పల్లెటూళ్ళలో, చిన్న చిన్న పట్టణాల్లో పరీక్ష కేంద్రాల్లో జరిపే పరీక్షలను విశ్వసించే అవకాశం ఉందా? ఈ కేంద్రాల్లో పనిచేసే వారిలో నిజంగా సర్టిఫైడ్‌ నిపుణులు కాదు.
  • చట్టం వల్ల నివారణ జరగదని ఇప్పటికే వరకట్నం సమస్య రుజువు చేసింది. కాబట్టి చట్టం వల్ల ఒరిగిదేమీ ఉండదు.
  • ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడ్డ వారిపై ఒక ముద్ర వేయడం నైతికంగా తప్పు.
ఇలాంటి ప్రధాన ప్రశ్నాలతో పాటు నిపుణులు, సామాజిక కార్యకర్తలు అనేక ఇబ్బందులను మంత్రి కోడెలకువివరిచారు. ఏపి ఎయిడ్స్‌ కంట్రోల్‌ సోసైటీ ప్రకారం రాష్ట్రంలో ప్రతి 20 మంది గర్భిణులలో ఒకరు ఎయిడ్స్‌ వ్యాధికిగురైన వారే.

దేశంలో అత్యధికంగా ఎయిడ్స్‌ రోగులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. తర్వాత స్థానం మనదే.

అయితే, దీనికి పరిష్కారం కోసం విపక్షాలతో కూడా చర్చించాలని కోడెల నిర్ణయించారు. విస్తృతంగా చర్చించాకే చట్టం తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఈ చట్టం వచ్చేఅసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టమని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X