కుంబ్లే ధాటికి విండీస్‌విలవిల
చెన్నై: రెండోటెస్ట్ లోనూ భారత్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండోటెస్ట్ లో వెస్ట్ విండీస్ 167 వికెట్లకే ఆలౌటైంది. గురువారం నాడు తన 32 వ బర్త్ డేను జరుపుకుంటోన్న అనిల్ కుంబ్లే విండీస్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. 30 పరుగులిచ్చి 5వికెట్లు తీసుకొని విండీస్ ను కోలుకోకుండా చేశాడు. అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్ లో ఐదువికెట్లకు పైగా తీసుకోవడం ఇది 30వ సారి. మరో స్పిన్నర్ హర్భజన్ సింగ్ మూడువికెట్లు
తీసుకొని సొంతగడ్డపై తమ స్పిన్ కు తిరుగులేదని రుజువు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన వెస్ట్ విండీస్ బ్యాట్స్ మెన్ తొలి ఓవర్ల నుంచి ఇబ్బంది పడ్డారు. జహీర్‌ఖాన్, జవగల్ శ్రీనాథ్ లిద్దరూ విరుచుకుపడ్డారు. తొలి ఏడు ఓవర్లలో ఒకటే పరుగు రావడాన్ని బట్టి పరిస్థితిఅర్థం చేసుకోవచ్చు. అయితే, లంఛ్ వరకు వికెట్లుపెద్దగా ఏమీ పడలేదు. లంచ్ కు ముందు క్రిస్ గెయిల్ ను హర్భజన్ అవుట్ చేశాడు.












Click it and Unblock the Notifications
