రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం
హైదరాబాద్: రాష్ట్రంలో ఐటి రంగంలో పెట్టుబడులుపెట్టేందుకు కృషి చేస్తానని మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్ హామీ ఇచ్చారు. మలేషియా వాణిజ్యవేత్తలు హైదరాబాద్ పట్ల ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం హైదరాబద్‌విచ్చేసిన మహతీర్ గురువారం పని ముగించుకొని తిరిగి మలేషియా వెళ్ళారు. గురువారం ఆయన నగరంలో పలు ప్రాంతాలను సందర్శించారు.
ప్రోటాన్ కార్ల ఫ్యాక్టరీ విషయంలో ఇదమిద్దంగా హామీ ఇవ్వలేదు. కానీ ఈవిషయాన్ని తప్పకుండా పరిశీలిస్తానని మాట ఇచ్చారు. హార్డ్ వేర్ రంగంలో కూడా ఆయన ఆసక్తిని కనబర్చారు.












Click it and Unblock the Notifications
