హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం శుక్రవారంనాడు భారీ ఎత్తున ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. ఐదు జిల్లాల కలెక్టర్లను, నాలుగు కార్పోరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది.
గుంటూరు జిల్లా కలెక్టర్‌గా రామకృష్ణారావును నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా సంజయ్ జాదును వేసింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గావికాస్ రాజును నియమించింది. పూనం మాలకొండయ్యను డిపిఎపి ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించింది. రంజన్ కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇంకా ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.