హైదరాబాద్: కృష్ణా జలాలపంపకంపై కేంద్ర ప్రభుత్వానికి తమ ఫిర్యాదులను వచ్చే నెల 15వ తేదీనఅందించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. శుక్రవారంవిలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం 9అంశాలతో కూడిన ముసాయిదా ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వానికిఅందించేందుకు రూపొందించిందని ఆయన చెప్పారు. ఈఅంశాలపై చర్చకు త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈఅంశాలపై ఇంతకు ముందు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. కేంద్రానికి ఈ ఫిర్యాదులనుఅందించే ముందు రాజకీయ పార్టీల ప్రతినిధుల, మేధావుల, తదితరుల అభిప్రాయాలను తీసుకుంటామని మంత్రి చెప్పారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఈవిషయంపై రాజకీయం తగదని ఆయన ప్రతిపక్షాలకు హితవు చెప్పారు.