సిఎంలకు పిఎం ఆర్థిక పాఠాలు

న్యూఢిల్లీ: ఉత్తమ ఆర్థిక క్రమశిక్షణకు కీలకమైన అభివృద్ధి, పాలనా సంస్కరణలవిషయంలో రాజకీయ ఏకాభిప్రాయానికి కృషి చేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిదెబ్బ తింటుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్థికాంశాలపై శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యల నుంచి గట్టెక్కాలంటే రాజకీయ ఏకాభిప్రాయ సాధన రంగాన్ని విస్తృతపరచాలని, కీలకమైన అభివృద్ధి, పాలనా సంస్కరణలవిషయాల్లో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అంగీకారం కుదరాలని ఆయన అన్నారు.

ఉత్తమ ఆర్థిక క్రమశిక్షణ సాధన ద్వారా అభివృద్ధి రేటుపెరుగుదలకు జరిగే కృషిలో నేటి సమావేశాన్ని ముఖ్యమంత్రులు ఒక మైలురాయిగా మలచగలరని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల ద్రవ్యలోటు అంగీకారయోగ్యం కాని స్థితికిపెరిగిందని ఆయన అన్నారు. ఇది మన దేశ ఆర్థిక, సామాజికాభివృద్ధిని తీవ్రంగాదెబ్బ తీసిందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు, వాటి నెరవేర్చే వ్యవస్థ స్థాయికి మధ్యపెద్ద అఘాతం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+