రేపే కోటీశ్వరులుకావచ్చు
ముంబాయి: తన దసరాపర్వదిన ప్రసంగాన్ని శివసేన అధినేత బాల్ థాకరే సమర్థించుకున్నారు. తన దసరా ప్రసంగంలో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మహారాష్ట్ర ప్రభుత్వం బాల్ థాకరేపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. తాను ముందస్తు బెయిల్ తీసుకోబోనని థాకరే ప్రకటించారు. తనపై కేసు నమోదు చేసినందుకు ఆయన ముఖ్యమంత్రివిలాసరావు దేశ్‌ముఖ్‌పై, ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.
అభ్యంతరకరమైనవి అయితే ఆ వ్యాఖ్యలు తాను చేసి ఉండేవాడిని కానని, తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, తనపై చర్యకు భుజబల్ బాధ్యుడు కారని, దేశ్‌ముఖ్ బాధ్యుడని ఆయన అన్నారు.
ఇంతకు ముందు కూడా తాను ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయలేదని, ఇప్పుడు కూడా చేయబోనని, తన ప్రకటనకు విస్తృత ప్రచారం కల్పించిన మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
