హైదరాబాద్: ప్రపంచచెస్ టోర్నమెంట్ ఫైనల్స్ తొలి రౌండ్‌లో భారత క్రీడాకారుడువిశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకున్నాడు. ఉజ్బెకిస్థాన్ క్రీడాకారుడు రుస్తమ్ కసిమ్‌జానోవ్‌తో ఆనంద్ డ్రాకు అంగీకరించాడు.
ఇద్దరు ఆటగాళ్లు 15వ మూవ్‌లో డ్రాకుఅంగీకరించారు. ఫైనల్ రౌండ్ ఆదివారంనాడు ఆడుతారు. తెల్ల పావులతో ఆడుతున్న ఆనంద్ గెలుపుపైవిశ్వాసంతో ఉన్నాడు. ఇది కూడా డ్రా అయితే టై బ్రేక్ ఆడాల్సి ఉంటుంది. ఇది అసాధారణమైన ఒపెనింగ్ లైన్ అని, ఈ పద్ధతిని రుస్తుం అవలంభిస్తాడని తాను ఊహించలేదని, అయితే రుస్తుం తనను ఏమీ ఆశ్చర్య పరచలేదని ఆనంద్ అన్నాడు.