విజయవాడ:పెరోల్‌పై విడుదలై జల్సాలు చేస్తున్న అంజుమన్ దీన్‌దార్ నేతలను ముగ్గురినివిజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారికి ఎస్కార్ట్‌గా నియమితులైనఅయిదుగురు పోలీసు కానిస్టేబుళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన తల్లికి బాగాలేదనే సాకుతోఅంజుమాన్ దీన్‌దార్ నేత ఇబ్రహాం, అతని ఇద్దరు అనుచరులు చర్లపల్లి జైలు నుంచిపెరోల్‌పై విడుదలయ్యారని, ఆ పేరుతో వారు విజయవాడ బార్లలో జల్సాలు చేస్తునట్లు సమాచారంఅందిందని, దాంతో తాము వారిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.అంజుమాన్ దీన్‌దార్ నేతలతో పాటు ఎస్కార్టుగా ఉన్న అన్వర్, లాల్, మోహన్ రెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.