రాజధానిలో సీఎం ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: కొంతవిరామం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టారు. రాష్ట్ర రాజధానిహైదరాబాద్ లో ఆయన శనివారం మూడు గంటల పాటుపర్యటించారు. నగరంలో వివిధ అభివృద్ధి పనులనుపరిశీలించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో అపరిశుబ్రత,మురికి కాల్వలే ముఖ్యమంత్రికి దర్శనమిచ్చాయి.అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డసీఎం నగర మెట్రో వాటర్ వర్క్స్ బోర్డుకుచెందిన ఒక అధికారిని, ఎంసిఎచ్ కు చెందినమరో అధికారిని సస్పెండ్ చేశారు.
అంబేద్కర్ ఆవాస్ యోజన్ కింద ఈ ఏడాది నగరంలో 5వేల ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. ఐడిఎచ్ ఎల్ కాలనీ తదతరప్రాంతాల్లో స్లమ్స్ లో నివాసం ఉంటోన్న వారికి పునరావాసంకల్పిస్తామన్నారు. మౌలిక సదుపాయాలకల్పన, పాఠశాలల భవంతులకు ప్రధానంగానగరంలో బడ్జెట్ ను కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రివెల్లడించారు.
ముషీరాబాద్ ప్రాంతమంతా అభివృద్ధి పరిచేలా ప్రణాళికరూపొందించాలని ఎంసిఎచ్ కమీషనర్ చిత్రారామచంద్రన్ ను ఆదేశించారు. అద్భుతమైనరోడ్లను నిర్మించాలన్నారు. ఈ ఆస్పత్రి సమగ్ర నిర్మాణానికిఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేస్తామన్నారు.












Click it and Unblock the Notifications
