కలిసికట్టుగాఉందాం: ఎమ్మెస్సార్‌

శ్రీనగర్‌: స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీని లేదా పార్టీల గ్రూప్‌ను తాను గుర్తించలేని పరిస్థితిలోనే రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించినట్లు జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ గిరీష్‌సి. సక్సేనా చెప్పారు.

గవర్నర్‌ పాలనను నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, కానీ దాన్ని నివారించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ నెల 21వ తేదీ తర్వాత కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తలుపులు తెరిచే ఉంటాయని ఆయన ప్రకటించారు. ఇప్పుడిక తాను ప్రధాన పార్టీలను రెండో విడత చర్చలకు ఆహ్వానిస్తానని, గవర్నర్‌ పాలన ఎంత కాలం కొనసాగుతుందనేది చెప్పలేనని ఆయన అన్నారు. రెండో విడత కూడా చర్చలువిఫలమైతే వారందరూ ఏకమై ముందుకు వచ్చేవిషయాన్ని వారికే వదిలేస్తానని ఆయన అన్నారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫరూఖ్‌ అబ్దుల్లా ఈ నెల 17వ తేదీ తర్వాత కొనసాగడానికి ఇష్టపడలేదని, దీంతో రాజ్యాంగ విధివిధానానికి భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని,అందువల్ల గవర్నర్‌ పాలన విధించాల్సి వచ్చిందని ఆయనవివరించారు.
అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారా అని అడిగితేఅసెంబ్లీలో మెజారిటీ సాధించలేని అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రాజ్యాంగ ధర్మమేమీ కాదని ఆయన జవాబిచ్చారు. ఏర్పాటయిన ప్రభుత్వం శాసనసభలోవిశ్వాసం పొందగలదని తాను సంతృప్తి చెందగలిగి ఉండాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+