విశాఖపట్నం: ఒరిస్సా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన గండిబండ అడవుల్లో ఆదివారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. అయితే, ఎవరికి ప్రాణనష్టం జరగలేదు.
వార్ అగ్రనేతలు చలపతి, భూషణ్ తదితరులు గండిబండ అడవుల్లో తలదాచుకున్నారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ జరిపారు. పోలీసులను చూసిన వార్ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. అయితే, అక్కడి నుంచి చలపతి, భూషణ్ లు తప్పించుకున్నారు. ఆ స్థలంలో పోలీసులకు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు లభించాయి. భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.