బాబు, హరికృష్ణల కలయిక
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తన బావమరిది హరికృష్ణను ఓ బహిరంగ వేదికపై చాలా కాలం తర్వాత కలుసుకొని ముచ్చటించారు. హరికృష్ణ టీడీపీ నుంచి దూరమయ్యాకవీరిద్దరూ కలిసి ఒకే వేదికపై కూర్చోవడం ఇదే ప్రథమం. ఈ సంఘటన ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. వేదిక: షాలిమర్ ఫంక్షన్‌హాల్. సందర్భం: నందమూరి తారకరత్న నటించిన యువరత్న చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం.
ఈ ముగ్గురి కలయికను కెమెరాలో బంధించేందుకులెన్స్ మెన్ పోటీపడ్డారు. ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం చడీ చప్పుడు చేయకుండా దూరంగా..ఆహ్వానితుల మధ్య ఒకడిగా కూర్చొన్నారు. చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులందరికీ నమస్కరించినా దగ్గుబాటి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications
