ఆర్టీసీ ఛార్జీలుఇప్పట్లో పెరగవు
శ్రీనగర్: కాంగ్రెస్‌సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సోమవారంనాడుపీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయీద్‌తో రెండో విడత చర్చలు జరిపారు. ఈ చర్చలు కూడా ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించలేకపోయాయి.
ముఫ్తీ మహ్మద్ సయీద్‌తో గంటన్నర చర్చల అనంతరం మన్మోహన్ సింగ్ జమ్మూ కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చర్చలవివరాలను ఆయన పార్టీ అధిష్ఠానానికి వివరిస్తారు.
సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని, అయితే కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చల్లో చెప్పుకోతగినపురోగతి సాధించలేదని సమావేశానంతరం పిడిపి వైస్ ప్రెసిడెంట్ ముజఫర్ బేగ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిని పడిపి ప్రాంతీయం చేయడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
