అద్వానీ టార్గెట్ - తీవ్రవాదికాల్చివేత
అహ్మదాబాద్: ఉపప్రధానిఎల్.కె.అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిలను హతమార్చాలని వ్యూహం పన్నిన తీవ్రవాది సమీర్‌ఖాన్ పోలీసు కాల్పుల్లో మరణించాడు. మంగళవారంఉదయం తెల్లవారుఝామున అహ్మాదాబాద్ లోనిఉస్మాన్ పురాలో జరిగిన ఎన్ కౌంటర్లో సమీర్ ఖాన్‌మరణించినట్లు పోలీసులు తెలిపారు.
సమీర్ ఖాన్ పాకిస్థాన్ కు చెందిన జైషేమహమ్మద్ తీవ్రవాద సంస్థకుచెందిన వాడు. మూడు సంవత్సరాలు పాకిస్థాన్‌లో తీవ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడని పోలీసులు తెలిపారు.దేశంలో వివిధ చోట్ల పలు నేరాలకు పాల్పడ్డ సమీర్‌ఖాన్ గత సెప్టెంబర్ లో మధ్యప్రదేశ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్నివిచారణ నిమిత్తం అహ్మదాబాద్ కు తరలించారు.
అతన్ని చంపిన స్థలం చూపించవల్సిందిగా సోమవారం రాత్రి సమీర్‌ను తీసుకెళ్ళారు. ఆ ప్రదేశం చేరుకున్నాక, సమీర్‌ఖాన్ తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతన్నిపట్టుకునేందుకు జరిపిన కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
