బాబూమోహన్ తనిఖీ మళ్లీఫెయిల్
విశాఖపట్నం: మరోసారి కార్మిక మంత్రి బాబూమోహన్ ఆకస్మిక తనిఖీ కార్యక్రమం డొల్లతనం బట్టబయలైంది. మంత్రి ఆకస్మిక తనిఖీ గురించి చాలా ముందే అధికారులకు తెలిసిపోయి, తగిన విధంగా జాగ్రత్తపడ్డారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రి ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీన్ని బట్టి చాలా ముందుగానే మంత్రి ఆకస్మిక తనిఖీవిషయం అధికారులకు తెలిసిపోయిందని స్పష్టమవుతోంది. ఈవిషయాన్ని మంత్రి బాబూమోహన్ కూడా అంగీకరించారు. లోటుపాట్లన్నీ సరిదిద్ధి ఆస్పత్రి నీట్‌గా తయారు చేసిపెట్టారని, అంతా ముందే సర్ది పెట్టారని మంత్రి అధికారుల వద్ద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆకస్మిక పర్యటనల గురించి ముందుగా తెలియకపోతే లోటుపాట్లు బయటపడతాయని మంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications
