రాజకీయ లబ్ధికే ఉగ్రవాదానికి ఊతం
న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటోందని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను అంతర్జాతీయ సమాజం వెలి వేయాలని ఆయన కోరారు.
ఉగ్రవాదం భారత్, అమెరికాలకే కాదు, మొత్తం ప్రపంచానికి, మానవత్వానికి, ప్రజాస్వామ్యాలకు పెను ప్రమాదమని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచం మేల్కోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జరిగిన దాడి మరోసారి ఉగ్రవాద ప్రమాదాన్ని ప్రపంచాన్ని తెలియజేసిందని ఆయన అన్నారు.
పాకిస్థాన్‌పై ప్రపంచ ఒత్తిడి ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఉపయోగపడుతుందని, అయితే సొంతంగానే మనం ఉగ్రవాదంపై విజయం సాధించగలమని అద్వానీ అన్నారు.












Click it and Unblock the Notifications
