చెచెన్యా రెబెల్స్ చర్యకు భారత్ ఖండన
న్యూఢిల్లీ: మాస్కోలోని ప్యాలెస్ ఆఫ్ కల్చర్ థియేటర్‌లోని వేయి మంది ప్రేక్షకులను చెచెన్యా తిరుగుబాటుదారులు బంధించడాన్ని భారత్ ఖండించింది. చెచెన్యా తిరుగుబాటు దారులు మాస్కోలని థియేటర్‌ను దిగ్బంధం చేసి ప్రేక్షకులను బందీ చేశారు. వేయి మంది బందీలలో 180 మందిని గురువారం విడుదల చేశారు. మరో 800 మంది తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్నారు. ఈ సంఘటన దృష్ట్యా రష్యా అధ్యక్షుడు పుతిన్ తన పోర్చుగల్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
చెచెన్యాలో సైనిక చర్యలను ఆపేయాలని, చెచెన్యా నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని చెచెన్యా తిరుగుబాటుదారులు రష్యాను డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు వారు రష్యాకు ఏడు రోజుల గడువు ఇచ్చారు.












Click it and Unblock the Notifications
