శోభానాగిరెడ్డికి చైర్‌పర్సన్ పదవి
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పదవి ఇచ్చారు. శోభానాగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి) చైర్ పర్సన్‌గా నియమిస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి.
మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్నా మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డికి శోభా నాగిరెడ్డి కూతురు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల సమావేశంలో ఎస్వీ సుబ్బారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓనమాలు తెలియనివారు మంత్రి వర్గంలో ఉన్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో శోభానాగిరెడ్డిని కార్పోరేషన్ చైర్‌పర్సన్ పదవి వరించింది.












Click it and Unblock the Notifications
