యుపి కాంగ్రెస్‌పై సోనియా ఆశలు
మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి త్వరలో మెరుగుపడగలదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలతో విసిగిపోయి ఉన్నారని ఆమె అన్నారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పాలనపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. వారికి అధికారంలో ఉండడమే ముఖ్యమని, అవినీతి, పేదరికాలపై పట్టింపు లేదని ఆమె విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో కొనసాగే హక్కు బిఎస్‌పి- బిజెపి ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి మారినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కూడా తప్పకుండా మారుతుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
