న్యూఢిల్లీ: తమ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మాత్రమే మూసివేశామని తెహెల్కా పోర్టల్ మేనేజింగ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చెప్పారు. తాము వెబ్‌సైట్‌ను పూర్తిగా మూసేయడం లేదని ఆయన గురువారం విలేకరులతో చెప్పారు.
ఆర్థిక వనరుల కొరత వల్ల వెబ్‌సైట్ అఫ్‌డేషన్‌ను తాత్కాలికంగా నిలిపేశామని, తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. సిబ్బంది సంఖ్య చాలా తగ్గిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. గత ఆరు నెలలుగా జీతాలు సరిగా చెల్లించలేకపోవడమే అందుకు కారణమని ఆయన అన్నారు. తెహెల్కా పోర్టల్ 120 మంది ఉద్యోగులతో ప్రారంభమైందని, ఇప్పుడు ఐదు నుంచి పది మంతి మాత్రమే ఉన్నారని ఆయన చెప్పారు.