దాసరి వచ్చాకా..నేనేందుకు?
హైదరాబాద్: సినిమా కార్యక్రమాల్లో తమాషా సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఓ విచిత్రమైన సంఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు ఓ సభకు విచ్చేసి..సభ మధ్యలో నుంచి కోపంగా వెళ్ళిపోయిన సంఘటన ఇది. ఈశ్వర్ అనే చిత్రం ఆడియో ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా అక్కినేని నాగేశ్వరరావు విచ్చేశారు.
రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఆయన ఏడుగంటలకే విచ్చేసి స్టేజికి ముందు వరుసలో కూర్చొన్నారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్...లతో పాటు విలేకరులతో సంభాషిస్తూ..సరదాగా గడిపారు. ఈలోపు సభ ప్రారంభమైంది. అంతలో ప్రముఖ దర్శకుడు దాసరి నారయణరావు విచ్చేసారు. ఆయనను చూసిన వ్యాఖ్యాత పరుచూరి వెంకటేశ్వరరావు, సభకు అధ్యక్షత వహించమని కోరారు.
మరి దాసరి అంటే అక్కినేనికి ఎందుకు పడదో తెలియదు. కానీ అక్కినేని సభ మధ్యలోంచి వెలుతున్న ఎవరూ పట్టించుకోకపోవడమే ఆశ్చర్యం కలిగించింది.












Click it and Unblock the Notifications
