రిపోర్టర్లపై వాయిలర్ మండిపాటు
విశాఖపట్నం: రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరుపుతోన్న ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వాయిలర్ రవి శనివారం పాత్రికేయులతో గొడవకు దిగాడు. ఉచిత విద్యుత్ పై గత రెండు రోజులుగా సమర్ధించుకుంటూ వస్తోన్న వాయిలర్ రవికి శనివారం ఉదయం విశాఖపట్నంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ ఉదయమే ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని విలేకరులు ఆయనను ఉచిత విద్యుత్‌పై గంటకు పైగా ప్రశ్నలను సంధించి ఊపిరిపీల్చుకోకుండా చేశారు. దాంతో అసహనం కోల్పోయిన రవి మీడియామెన్ పై ఎదురుదాడికి దిగారు. మీరు టిడిపి ఏజెంట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విలేకరులపై ఆగ్రహం చెందారు.
ఆయన దానికి సరైనా సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో విలేకరుల ఆయన ఇరుకున పెట్టే విధంగా వెంటవెంటనే అదే అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications
