కొనసాగుతోన్న చెరుకు రైతుల ఆందోళన
అనకాపల్లి, చిత్తూరు: నల్లబెల్లం నిషేధంపై చెరుకు రైతులు ఆందోళన ఉధృతం చేశారు. శనివారం అనకాపల్లిలో మూడు గంటలపాటు రాస్తారోకో, రైల్ రోకో నిర్వహించారు. నల్లబెల్లం నిషేధం ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రైల్ రోకో వల్ల పలు రైళ్ళు నిలిచిపోయాయి. ఇదే రూట్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తోన్న సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రైలు దిగి రైతుల ఆందోళనలో పాలు పంచుకున్నారు.












Click it and Unblock the Notifications
