మాండ్యాలో జైల్‌భరో-అరెస్టులు
మాండ్యా (కర్ణాటక): తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను ఆపేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ వదిలారు. స్వల్పంగా లాఠీఛార్జీ చేశారు. దాదాపు 400 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
రైతులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ రాజీనామా చేయాలని మాదెగౌడ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు తమ జైలో భరో కార్యక్రమం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. మాండ్యా, శ్రీరంగపట్నం, మద్దూరు, మాలవల్లి ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.












Click it and Unblock the Notifications
