సుప్రీంకు కృష్ణ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ సుప్రీంకోర్టుకు సోమవారంనాడు బేషరతుగా క్షమాపణ చెప్పారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తమ ప్రభుత్వం అమలు చేయకుండా తప్పు చేసిందని ఆయన అంగీకరించారు.
తమిళనాడుకు రోజుకు వేయి క్యూసెక్స్‌ల నీటిని విడుదల చేయడం ఈ నెల 28వ తేదీన ప్రారంభించినట్లు కర్ణాటక కోర్టుకు తెలియజేసింది. రిజర్వాయర్ నుంచి ఎంత నీటిని విడుదల చేస్తున్నారనే విషయం కర్ణాటక దాఖలు చేసిన అఫిడవిట్‌లో లేదని సుప్రీంకోర్టు అన్నది. తమిళనాడులోని మెట్టూరు డ్యామ్‌కు ఎంత నీరు చేరుతోందనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications
