హైదరాబాద్: భారీ వర్షాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ రెండు జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఈ రెండు జిల్లాల్లోని పలు మండలాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. ఆక్వా చెరువులు గండ్లు తెగి చేపలు నీటిలో కొట్టుకుపోయాయి. పిడుగుపాటుకు, ఇతర ప్రమాదాలకు గురై ముగ్గురు మరణించారు. చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లాలోని అల్లూరు, కావలి, వెంకటాచలం, తదితర మండలాల్లోని రహదారులు దెబ్బ తిన్నాయి. ప్రకాశం జిల్లాలోని 20 గ్రామాల్లో కుండపోతగా వర్షాలు పడ్డాయి. చెరువుల గట్లు తెగాయి. ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలంతో పాటు మరో మండలంతో పాటు వర్షపు తాకిడికి గురైంది.