బెంగుళూర్: రేపటి భవిష్యత్తుకు ప్రతీకలైన పిల్లలు కలలు కనాలని, ఆ కలలను, లక్ష్యాలను సాధించడానికి శ్రమించాలని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ బెంగుళూర్ విద్యార్థులకు ఉద్బోధించారు.
స్టూడెంట్స్ ఇంటర్నెట్ వరల్డ్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 600 మంది విద్యార్థులకు 300 కంప్యూటర్ల ద్వారా ఒక గంట పాటు పాఠం చెప్పారు. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్‌ల నిర్వచనాలు చెప్తూ ఆయన బ్రౌజర్, యూనిఫామ్ రిసోర్స్ లోకేటర్ పనులను వివరించారు. వెబ్‌సనైట్ లెర్ట్న్‌దెన్‌నెట్ డాట్ కామ్ ద్వారా బ్రౌజ్ చేయిస్తూ ఇంటర్నెట్ సుబోధకమయ్యేలా ఆయన చెప్పారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.