మానవ కల్పిత విపత్తులు ప్రమాదం

న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాల కన్నా మనిషి కావాలని సృష్టించే విపత్తులు అత్యంత ప్రమాదకరమైనవని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. ఉగ్రవాదులు వాడుతున్న ఆయుధాల నుంచే నిజమైన ప్రమాదం ఎదురువుతోందని ఆయన అన్నారు.

అణు, జీవ, రసాయన సంబంధ ఆయుధాల నుంచే నిజమైన ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి రాజకీయ, ఆపరేషనల్‌, శాస్త్రీయ స్థాయిల్లో ప్రాంతీయ సహకారం పెంపొందాలని ఆయన అన్నారు. విపత్తుల తగ్గింపునకు ప్రాంతీయ సహకారం అనే అంశంపై ఏర్పాటయిన సదస్సును ఆయన మంగళవారం ప్రారంభించారు.

అమెరికాలోని సెప్టెంబర్‌ 11 దాడులు, భారత పార్లమెంటుపై దాడి, బాలీ బాంబింగ్స్‌, మాస్కో థియేటర్‌ ప్రేక్షకులను బంధించడం వంటి సంఘటనలు ఆ దేశాలు విపత్తుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. భోపాల్‌ నేరపూరితమైన నిర్లక్ష్యం వల్ల జరిగిందని, అయితే కావాలని సృష్టించే విపత్తులు ఇంకా ప్రమాదకరమైనవని, ప్రజాస్వామ్య, మానవత్వ, నాగరిక సమాజ శత్రువులు వీటిని సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఐదేళ్లలో విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. సహకారానికి సార్క్‌ విపత్తుల నిర్వహణ వేదికను ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+