హైదరాబాద్: అక్రమ భూకబ్జా కేసులో పాణ్యం శాసనసభ్యుడు పార్థసారథి రెడ్డి బావమరిదిని, మరో 11 మంది ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్‌లో విలువైన భూమిని అక్రమంగా వీరు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి విలువ 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అరెస్టయిన శాసనసభ్యుడి బంధువు ప్రసాద్ రెడ్డిని, ఆయన అనుచరులను పోలసులు మంగళవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ కేసు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా పడింది. మొత్తం 5,500 గజాల ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది. నిందితుల నుంచి పోలీసులు ఒక టాటా క్వాలిస్‌ను, మరో కారును, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.