మతహింసతో విదేశీ పెట్టుబడులకు బ్రేక్
న్యూఢిల్లీ: ఇండో- పాక్ ఉద్రిక్తతలు, ఇటీవలి గుజరాత్ మత హింస, పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో అనిశ్చితి భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవేశానికి బ్రేక్‌లు వేస్తున్నాయని భారత్‌లో ఆమెరికా రాయబారి రాబర్ట్ బ్లాక్‌విల్ అన్నారు.
భారత మార్కెట్లో అడుగు పెట్టాలనే విదేశీ పెట్టుబడిదారుల ఉత్సాహంపై భారత, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, మత హింస నీళ్లు చల్లాయనడంలో సందేహం లేదని ఆయన అన్నారు.
భారత్ ఆకర్షణీయమైన ప్రదేశం కాదని, పెట్టుబడులు రావడానికి దీర్ఘకాలిక స్థిరత్వం లేదని, దీర్ఘ కాలం మత హింస జరగదనే గ్యారంటీ కూడా లేదని ఆయన అన్నారు. భారత ఆర్థిక సంస్కరణల్లోని అనిశ్చితి వల్ల పెట్టుబడులు పెట్టడానికి అమెరికన్లు వెనుకంజ వేస్తున్నారని ఆయన అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణపై జరుగుతున్న చర్చ తాజా ఉదాహరణ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ విధించే పన్నులు, టారిఫ్‌లు చాలా అధికంగా ఉన్నాయని, వాణిజ్య నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం ఎక్కువ అని అమెరికా అన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉత్పత్తుల పేటెంట్‌ను రక్షించడానికి భారత్లో ఆధునిక న్యాయపరమైన చట్రం వుంటే అమెరికా ఫార్మాస్యూటికల్, బయోటిక్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌కు విస్తరిస్తాయని ఆయన చెప్పారు. ఆర్థిక చర్యల్లో చైనా చాలా ముందున్నదని, అమెరికన్ ఇన్వెస్టర్లకు చైనా ఆకర్షణీయమైన దేశంగా మారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
