న్యూఢిల్లీ: పదవ పంచవర్ష ప్రణాళిక సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 6,71,009 కోట్ల ప్రణాళిక పెట్టుబడులు గల ఈ సిఫార్సులను ప్రధాని వాజ్‌పేయి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గం సమావేశం ఆమోదించింది.
ఈ సిఫార్సులను ఇంతకు ముందు ప్రణాళిక సంఘం ఆమోదించింది. వార్షిక పెరుగుదల రేటును 5.5 శాతం నంఉచి 8 శాతానికి పెంచే లక్ష్యంతో ఈ ప్రణాళిక ఖరారైంది. మూడు వాల్యూమ్‌ల ఈ డాక్యుమెంట్‌లో వ్యవసాయరంగంలో పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. వచ్చే ఐదేళ్లలో 50 మిలియన్ల ఉద్యోగావకాశాలు కల్పించాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏడాదికి 7.5 బిలయన్ డాలర్లకు పెంచాలని, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 78 వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ప్రతిపాదించారు.