ఇక తెనాలి టూన్ రాముడు!
హైదరాబాద్: అమెరికా తర్వాత యానిమేషన్ రంగంలో భారత్ ఎదుగుతోంది. సాప్ట్ వేర్ రంగం మాదిరిగా ఈ రంగంలో భారతీయ కళాకారులు అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ విషయంలో టూన్జ్ యానిమేషన్ ఇండియా అనే కంపెనీ అగ్రగామిగా కొనసాగుతుంది. అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాల సంఘం అధ్యక్షుడు బిల్లీ డెన్నిస్ అధ్వర్యంలో భారతీయ యానిమేషన్ రంగం ముందడుగు వేస్తోంది. త్రివేండ్రంలో బిల్లీ స్థాపించిన ఈ కంపెనీ భారతీయ జానపద, చారిత్రక కథల హీరోలను తీసుకొని యానిమేషన్ ఫిల్మ్స్ రూపొందిస్తోంది.
రామయణ, భారత గాథల నుంచి ఉపకథలను తీసుకొని యానిమేషన్ చిత్రాలను గతంలో రూపొందించినా, చారిత్రాక హీరోల మీద ఇంతవరకు యానిమేషన్ ఫిల్మ్స్ రాలేదు. టూన్జ్ ఇండియా కంపెనీ ది అడ్వెంచర్స్ ఆఫ్ తెనాలి రామన్ పేర ఒక యానిమేషన్ ఫీచర్ సిరీస్ ను రూపొందించింది. భారతదేశంలో వచ్చే జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్ లో విలేకరులకు ప్రదర్శించారు.