హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి వారానికి ఐదు రోజులు ఉంటుంది. ఇంత వరకు ఈ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు మాత్రమే నడుస్తోంది.
వచ్చే నెల 9వ తేదీ నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ వారానికి అయిదు రోజులు నడుస్తుందని రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని సౌకర్యాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొద్ది సేపు విలేకరులతో మాట్లాడారు. కాకినాడ, విశాఖపట్నంల నుంచి తిరుపతికి రెండు వేర్వేరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ఆయన తెలిపారు.