తిరుమలేశుని దర్శించుకున్న అద్వానీ
తిరుపతి/హైదరాబాద్: ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. అనంతరం ఆయన తిరుమలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
జమ్మూ కాశ్మీర్‌లో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడగలదని, ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కృషి చేయగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొటాను ప్రయోగించబోమని కాబోయే ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్ సయీద్ చేసిన వ్యాఖ్యపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.
బుధవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా తూముగుంట డ్వాక్రా గ్రూప్ ప్రదర్శనను తిలకించారు. అనంతరం అద్వానీ గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. గురువారం అద్వానీ పోలీసు అకాడమీలో జరిగే ఐపియస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. సాయంత్రం భారతీయ జనతా పార్టీ (బిజెపి) సమావేశంలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications
