హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కరవు భత్యం (డిఎ) పెంపు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
డి.ఎ. పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏ మేరకు భారం పడుతుందో పరిశీలించాల్సి వున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విలేకరులతో అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటుపాట్లను ఎదుర్కుంటోందని, డి.ఎ. పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదని ఆయన చెప్పారు.