రాష్ట్రంలో సెల్ వన్‌సేవలు ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో బి.ఎస్ ఎన్ ఎల్ తన సెల్ ఫోన్ సర్వీసులను బుధవారం ప్రారంభించింది. సెల్ వన్, ఎక్సెల్ పేరుతో రాష్ట్రంలోని 84 పట్టణాల్లో సేవలను ప్రారంభించింది. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం పక్కనే ఉన్న రైల్వేశాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయతో ఆయన సెల్ ఫోన్ లో మాట్లాడారు. అతి తక్కువ టారిఫ్ తో బిఎస్ ఎన్ ఎల్ సెల్ ఫోన్ సేవలను అందిస్తోంది.












Click it and Unblock the Notifications
