వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రాష్ట్రంలో ఈ-పోలీస్‌వ్యవస్థ!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పోలీసు సంస్కరణలో భాగంగా రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగంలో సమూల మార్పులు చేపట్టనున్నారు. పోలీసింగ్‌ లో ఇక విస్తృతంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డిజిపి పేర్వారం రాములు విలేకరులకు వెల్లడించారు. నిధుల కొరత వల్ల ఇన్నాళ్ళూ సంస్కరణలకు, అధునాతన సౌకర్యాల కల్పనకు వెనుకాడమని ఆయన తెలిపారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీస్‌ వ్యవస్థ ఆధునికీకరణకు ఈ ఏడాది 70 కోట్ల రూపాయల నిధులు వస్తాయని, వీటితో ఇ-కాప్‌ సిస్టమ్‌ ను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. కొంత మొత్తం రాష్ట్రప్రభుత్వం కూడా ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు.

ఐ.టి సహాయంతో రాష్ట్రమంతటా పటిష్టమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడమే ఇ-కాప్‌ సిస్టమ్‌. దీన్ని తొలుతగా రాష్ట్రరాజధాని హైదరాబాద్‌ తో పాటు రంగారెడ్డి, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రారంభిస్తారు. నేరాల నమోదు, తీరు, సమాచారం పూర్తి స్థాయిలో ఈ సెంటర్స్‌ లో ఉంటుందని, కంప్యూటర్‌ పై ఇలా కొట్టి అలా సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చని ఆయన తెలిపారు. అలాగే సైబర్‌ నేరాలను డీల్‌ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X